తక్కువ ధరకే బంగారం అంటూ టోకరా… ఘరానా ముఠాను పట్టుకున్న ఏపీ పోలీసులు

తక్కువ ధరకే బంగారం అంటూ టోకరా… ఘరానా ముఠాను పట్టుకున్న ఏపీ పోలీసులు

 

సత్యసాయి జిల్లాలో ఘరానా మోసం

నకిలీ బంగారంతో మోసగిస్తున్న ముఠా

10 మందిని అరెస్ట్ చేసిన సోమందేపల్లి పోలీసులు 

తక్కువ ధరకే బంగారం అంటూ నకిలీ బంగారంతో టోకరా వేస్తున్న ఘరానా ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. చవకగా బంగారం వస్తుందన్న ఆశతో పలువురు ఈ ముఠా వలలో చిక్కుకుని లక్షల్లో నష్టపోయారు. దీనిపై శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 

రంగంలోకి దిగిన పోలీసులు మోసగాళ్ల ముఠా ఆటకట్టించారు. 10 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.21 లక్షల నగదు, 2.6 కిలోల నకిలీ గోల్డ్ చైన్లు, ఐదు మోటార్ సైకిళ్లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సత్యసాయి జిల్లా పోలీసులను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. ఫేక్ గోల్డ్ స్కాంపై వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకున్నారంటూ ప్రశంసించారు

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version