బిల్డింగ్ కట్టిన అధికారుల పై చర్యలు తీసుకోకుండా అంగన్వాడికి టీచర్ పై చర్యలా

బిల్డింగ్ కట్టిన అధికారుల పై చర్యలు తీసుకోకుండా అంగన్వాడికి టీచర్ పై చర్యలా

 

*వెంకటాపూర్ అంగన్వాడి టీచర్ పై సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలి*

 

*సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు అతిమేల మానిక్*

నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈనెల 24న అంగన్వాడి కేంద్రం భవనం పైకప్పు కూలిన ఘటనలో నాన్నతో పాటించకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన అధికారులపై చర్యలు తీసుకోకుండా అంగన్వాడి టీచర్ అంబిక సిడిపిఒ లను సస్పెండ్ చేయడం దారుణమై సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు…

ఈరోజు నారాయణఖేడ్ కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ కోసం 40 సంవత్సరాల కింద భవనం నిర్మించారు. 15 సంవత్సరాల కిందట భవనం శిథిలవస్తులో ఉన్నదని నూతన భవనం నిర్మించుకొని ప్రైమరీ పాఠశాల నడుస్తున్నది శిధిలావస్థలో ఉన్న భవనాన్ని అంగన్వాడి కేంద్రం కు ఇవ్వడం లో తప్పు ఎవరిది గత రెండు సంవత్సరాల క్రితం 1,50,000 రూపాయలతో భవనాన్ని రిపేర్ చేయించారు రిపేర్ చేయించిన భవన పైకప్పులు కూలిపోవడంతో పిల్లలకు అంగన్వాడి టీచర్ కు తీవ్ర గాయాలయ్యాయి అని అన్నారు ఈ ఘటనపై ఉన్నంత అధికారులతో సమగ్ర విచారణ జరిపి నాణ్యత పాటించకుండా భవనం నిర్మించిన అధికారల పై చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ అంబిక సిడిపిఓ లోనై ఉన్న సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని అన్నారు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు శిథిలావస్థలో ఉన్న భవనాలలోని కొనసాగుతున్నాయని దీంతో దీంతో టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు 

ఈ సమావేశంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎన్ రమేష్ నాయకులు సతీష్ మైపాల్ ప్రవీణ్ అరుణ్ కాన్సిరాం సంతోష్ తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment