అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళి పూజ తప్పకుండా పాటించాలి 

అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళి పూజ తప్పకుండా పాటించాలి 

..జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

 

 

జిల్లాలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.

 సోమవారం మెదక్ జిల్లా నిజాంపేట్ మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను సంబంధిత తాసిల్దార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎన్నికల నిర్వహణకు 

‌జిల్లాలోని 21 మండలాల పరిధిలో గ్రాడ్యుయేట్ ( 22) టీచర్స్- (21) మొత్తం -43 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు , 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.

ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్స్ ఉపయోగిస్తారని, అవసరమగు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. 

ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను పొలిటికల్ పార్టీలు తప్పనిసరిగా సంబందిత ఆర్డీవోల దగ్గర అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు.  

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని అన్నారు. 

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ‌ ముందుకు పోతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సురేష్ కుమార్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version