మళ్లీ పేలిన తుపాకి తూటా.గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పులు

మళ్లీ పేలిన తుపాకి తూటా.గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాల్పులు

 

ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొరికేశాడు..సీపీ 

 

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్ లో పేలిన తుపాకి తూటా కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై ఓ ఘరాన దొంగ నాలుగు రౌండ్ల కాల్పులకు తెగ బడ్డాడు ఈ ఘటనలో ఒక బుల్లెట్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పాదం లో చొచ్చుకెళ్లింది అయినా కూడా ఏ మాత్రం లెక్కచెయ్యకుండా విజృంభించి పోరాడి నిందితుడీనీ బౌన్సర్లతో కలసి పోలీసులు పట్టుకున్నారు పలు దొంగతనాల్లో తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం మాదాపూర్ సీసీఎస్ పోలిసులు వెతుకుతున్నారు ఈ క్రమంలో ప్రభాకర్ తరచుగా పబ్ లకు వస్తున్నట్లు సమాచారం అందింది దీంతో ప్రభాకర్ కోసం అన్ని పబ్బులవద్దా నిఘా ఏర్పాటు చేశారు అయితే శనివారం రాత్రి ప్రభాకర్ గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ కి వచ్చినట్లు తెలియడం తో మాదాపూర్ సిసిఎస్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాం రెడ్డి మరో ఇద్దరు కానిస్టేబుళ్ళు అక్కడికి వెళ్లారు రాత్రి 6.30 గంటల ప్రాంతం లో పబ్ నుండి బయటకు వస్తున్న ప్రభాకర్ ను కానిస్టేబుళ్లు పట్టుకోవడానికి ప్రయత్నినించగా నిందితుడి అతడి వద్దున్న పిస్టల్ తో పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడూ ఈ కాల్పుల నుండి తప్పించుకున్న కానిస్టేబుళ్లు పబ్ బౌన్సర్ల తో కలసి ప్రభాకర్ ను పట్టుకుని గన్ స్వాధీనం చేసుకున్నారు వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న మరో గన్ తో ప్రభాకర్ పక్కనున్న కానిస్టేబుల్ వెంకట్రాంరెడ్డి పై కాల్పులు జరపగా ఒక బుల్లెట్ అతడి ఎడమ కాలు పాదం లోనుండి బయటికి దూసుకెళ్లింది వెంటనే మిగతా పోలీసులు ప్రభాకర్ వద్దనుండీ రెండవ గన్ కూడా స్వాధీనం చేసుకొని కాల్పులు జరిపిన ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రాంతానికి తరలించారు కాల్పుల్లో గాయపడ్డ వెంకట్రాంరెడ్డి తో పాటు పబ్ బౌన్సర్ ను నానక్ రామ్ గూడ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వీరిని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి .మాదాపూర్ డీసీపీ వినీత్ తో కలసి పరామర్శించి వారి ఆరోగ్య విషయం అడిగి తెలుసుకున్నారు వెంకట్రాంరెడ్డి ఎడమ కాలు పాదంలోని ఎముకకు గాయం అయ్యిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీసీపీ వినీత్ తెలిపారు

 

*అతడిపై నిఘా పెట్టి పట్టుకున్నాం.సీపీ అవినాష్ మహంతి*

 

గత రెండు సంవత్సరాలుగా నిందితుడు ప్రభాకర్ ను ట్రాక్ చేస్తున్నామని సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి తెలిపారు నిందితుడు ఇంజినీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసుకొని దొంగతనలు చేస్తున్నట్లు వివరించారు అడ్మిషన్లు పరీక్షల ఫీజుల రూపం లో వస్తున్న డబ్బులను కాలేజీలోనే పెడతారని వాటిని సులభంగా కాజెయ్యొచ్చని నిర్ణయించుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు అయితే 2022 లో అనకాపల్లి కోర్టు నుండి వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలిస్తున్న క్రమంలో తప్పించుకున్నాడు అప్పటి నుండీ పరారిలో ఉంటూ సైబరాబాద్ హైదరాబాద్ ప్రాంతం లో దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు

ఇటీవల మోయినాబాద్ లో జరిగిన ఓ దొంగతనం కేసులో ప్రభాకర్ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నామని దీంతో ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపారు అయితే ప్రభాకర్ తనను గుర్తు పట్టకుండా ముసుగులు ధరిస్తూ తిరుగుతూ మకాంలు మారుస్తు వస్తున్నట్లు చెప్పారు ఈక్రమంలో శనివారం ప్రభాకర్ పై నిఘా పెట్టి పట్టుకున్నట్లు అతడి వద్ద 2గన్లు 23 రౌండ్ల బుల్లెట్ స్వాధీనం చేసుకున్నట్లు కమీషనర్ అవినాష్ మహంతి తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment