జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి సిఐ చంద్ర శేఖర్
మక్తల్ ప్రధాన జాతీయ రహదారిపై నారాయణపేట ఎక్స్ రోడ్ వద్ద మక్తల్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది హెల్మెట్ వినియోగించిన ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మక్తల్ సిఐ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని లేనియెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారించే ఉద్దేశంతో ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి ఒక్క వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. వాహనాలు నడిపే సమయంలో వాహనానికి సంబంధించిన ఆర్ సి డ్రైవింగ్, లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలకు నెంబర్ ప్లేటు తప్పనిసరిగా వేయించుకోవాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. త్రిబుల్ రైడింగ్ వాహనాలు నడుపరాదని, రాష్ డ్రైవింగ్ చేయరాదని, మైనర్లు వాహనాలు నడుపు రాదని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రజలను విద్యార్థులను ఎక్కించుకోరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, కృష్ణం రాజ్, శివశంకర్, పోలీసు సిబంది తదితరులు పాల్గొన్నారు