నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే షురూ

నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే షురూ

 అర్హులెవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు

 విడతల వారీగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది

 

 రామాయణపేట మున్సిపాలిటీ,కట్ర్యాల గ్రామం లో

 సర్వే తీరును పరిశీలిస్తున్న కలెక్టర్

 

 …జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లుకు లబ్ధిదారుల ఎంపిక

నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు రామాయంపేట మండలం కాట్రయల గ్రామంలో, మున్సిపాలిటీ పరిధిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లుకు విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ, ఇంట్లో సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఏం జీవనం సాగిస్తారు? పొలం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? వంటి తదితర వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీకి నిరుపేదల గుర్తింపుకు సర్వే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించగా, విచారణా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను సేకరిస్తున్నాయని ఆయన వివరించారు. సర్వే నిర్వహణ ద్వారా పథకాల అమలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వే నిర్వహణకు ప్రజల సహకారం అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాల లబ్ధి ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. 

 సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ అభినందించారు. రైతు భరోసాకు సాగులో ఉన్న భూముల వివరాలు నమోదుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలో పాల్గొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి అనువుగా లేని భూములు అనగా నాలాలు, కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, ప్రభుత్వం ప్రాజెక్టులు కొరకు తీసుకున్న భూములు తదితర వివరాలను ఎలాంటి పొరపాటుకు తావులేకుండా పకడ్బందీగా నమోదులు చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో ఏమైనా సమస్య వస్తుందా వస్తే కారణాలను వ్రాయాలని సూచించారు. 16 నుండి 20వ తేది వరకు సర్వే జరుగుతుందని, 21 నుండి 24వ తేది వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.

మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. 

కాకపోతే విడతల వారీగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. అర్హులెవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. 

అయోమయానికి గురికాకుండా తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా పారదర్శకంగా.. అత్యంత జాగ్రత్తగా నిర్దేశిత గడువు లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట రామాయంపేట ప్రత్యేక అధికారి ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్, రామాయంపేట తాసిల్దార్ రజని, , మండల అభివృద్ధి అధికారి , ఆయా మండలాల, గ్రామాల, ఎంపీఓలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్ లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version