కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య…

ఎస్సై మహ్మద్ గౌస్

 

 

మెదక్ జిల్లా కొల్చారం పిఎస్ పరిధిలో

ని కొల్చారం తండాకు చెందిన లంబాడి రవీందర్ తండ్రి సక్యా వయసు 27 సంవత్సరాలు కులం ఎస్టి లంబాడి వృత్తి కొల్చారం పోస్ట్ ఆఫీస్ నందు బిపిఎం గా విధులు నిర్వహిస్తున్నారు అట్టి వ్యక్తికి కండ్లకు పస్కలు అయినందున ఎంతకు చూపించినా తగ్గలేదు అట్టిపసకల వలన లివర్ పాడయి కడుపులో నొప్పి వస్తుంది అట్టినొప్పి భరించలేక నిన్న తేది 31. 1.2025 నాడు ఉదయం అందాజా 11 గంటల సమయంలో తన ఇంట్లో ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇట్టి విషయాన్ని తన భార్యతో తెలుపగా తన భార్య మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెంటనే చికిత్స నిమిత్తము మెదక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొని పోగా ప్రధమ చికిత్స అనంతరము డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్లోని బహదూర్ పల్లి లో గల ఎస్వీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి అడ్మిషన్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు 01.02.2025 నాడు ఉదయం అందాజా 06.10 గంటల సమయంలో మృతుడుఅగు లంబాడి రవీందర్ మరణించినాడు.మృతుడికి పస్కలు అయి కడుపులో నొప్పి రాగా అట్టినొప్పి భరించలేకనే ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి నందువల్లనే చికిత్స పొందుతూ మరణించాడు అట్టి శవం పై మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి నందు పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు నిమిత్తము శవాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించినది. ఎఫ్ఐఆర్ ఏఎస్ఐ టీ తారా సింగ్ కేసు నమోదు పరిచి పరిశోధన ప్రారంభించడం అయినది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version