కార్మికులకు కర్షక వర్గాలకు నిరాశపరిచిన బడ్జెట్

కార్మికులకు కర్షక వర్గాలకు నిరాశపరిచిన బడ్జెట్

 

బడా కార్పొరేట్ శక్తులకే కేంద్ర బడ్జెట్ 

 

ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు 

 

 

బడ్జెట్ కేటాయింపులో కార్మిక, కర్షకులకు, పేద ప్రజల నడ్డి విడిచి బడా కార్పొరేట్ శక్తులకు భరోసానిచ్చిందని, వేతన జీవులకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిపిఐ ఆఫీస్ కామ్రేడ్ ధర్మ బిక్షం భవనంలో రిక్షా కార్మికుల యూనియన్ అత్యవసర సమావేశం పెండ్ర కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025—26 బడ్జెట్ పేదప్రజలును వంచన చేసి బడా కార్పొరేట్ శక్తుల ఉడిగం చేసే విధంగా ఉందని దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని అన్నారు. ఈ బడ్జెట్ కార్మిక, రైతు, పేద వర్గాలకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు. వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు జరపలేదని పేదవాళ్ళు మరింత పేదవాలుగా, సంపన్నులు మరింత సంపన్నుగా చేసే బడ్జెట్ అని ఉపాధి హామీకి నామ మాత్రము కేటాయింపులు చేశారని విమర్శించారు. ఈ బడ్జెట్నే వ్యతిరేకించి భవిష్యత్తు పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ప్రాంతీయ గౌరవ అధ్యక్షులు చామల అశోక్ కుమార్, రిక్షా యూనియన్ కార్యదర్శి వాడపల్లి వెంకన్న, రిక్షా కార్మికులు బండ్ల హనుమంతు, వాడపల్లి శ్రీను, బానోత్ రంగా, రాము, గ్రాబియల్, లక్ష్మయ్య, కోటయ్య, గూడేలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment