నవంబర్ 24న గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన సదరమ్ కార్యక్రమానికి కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన మేకల కొమురయ్యకు చెందిన దున్నపోతును తీసుకెళ్లారు. సదరమ్ కార్యక్రమానికి సహకరించిన కొమురయ్య యాదవ్ కు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ యాదవ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే తమ గ్రామానికి విచ్చేసినందుకు శ్రీధర్ యాదవ్ కు కమాన్ పూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు గెల్లు లింగయ్య, బోదన హరిప్రసాద్, కల్వల రాజు, ఈర్ల భూమయ్య, ఈర్ల అజయ్, మేకల సతీష్, లక్కీ, మారక స్వామిలతో పాటు తదితరులు ఉన్నారు.
యాదవులకు ఆత్మీయ సన్మానం
Published On: November 30, 2024 6:35 pm