గ్రామల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి.

విద్య వైద్యం రైతుల అభివృద్ధి కి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్లసంజీవరెడ్డి.

చార్మినార్ ఎక్స్ ప్రెస్. నవంబర్ 29.
పెద్ద శంకరంపేట్. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు.శుక్రవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చిలపల్లి ఉత్తులూరు.రామోజీ పల్లి వీరోజిపల్లి సంగారెడ్డి పేట ,జూకల్
బురుగుపల్లి , భుజరంపల్లి ,పెద్ద శంకరంపేట తదితర గ్రామాలలో ఎన్ఆర్ఈ జి ఎస్ నిధుల ద్వారా 3 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య ం రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. త్వరలోనే అర్హులైన వారందరికీ నూతన రేషన్ కార్డులు, పూర్తిస్థాయి రుణమాఫీ మంజూరు చేస్తామని, రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బులను జమ చేయడం జరుగుతుందన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గ్రేసి భాయ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కర్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయిని మధు. నాయకులు నారా గౌడ్, ఆర్ ఎన్ సంతోష్ కుమార్, దాచా సంగమేశ్వర్. అలుగుల సత్యనారాయణ. విగ్రo రాజన్ గౌడ్ , గంగారెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు అవుసుల భవాని ,మాజీ ఎంపీపీ బాసాడ రాజు.ప్రతాప్ గౌడ్ . అశోక్ .రామచందర్ . లక్ష్మణ్ . పున్నయ్య .ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment