ముదిరాజ్ సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ డా. వాకిటి శ్రీహరి

శంకర్ పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ డా. వాకిటి శ్రీహరి

 గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం మధు గారు, అందే బాబయ్య గారు మరియు శంకర్ పల్లి మండల ముఖ్య ముదిరాజ్ నాయకులు సంఘ పెద్దలు ముదిరాజ్ సోదరులు. ఈ కార్యక్రమంలో భాగంగా ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముదిరాజ్ లకు సరైన న్యాయం ఎప్పటికైనా జరగాలంటే బీసీ డి నుండి బిసి ఏ కు మార్చినప్పుడే విద్య పరంగా, ఉద్యోగాల పరంగా కానీ, రాజకీయ పరంగా ఇంకా మొదలైన వాటిలో సరైన అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కుల గణన ద్వారా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ సరైన అవకాశాలు కల్పించాలనే తలచారన్నారు. ముదిరాజ్ లు అందరు ఇతర కులాల వారికి అన్ని రకాలుగా సాయంగా ఉంటున్నారు కావున అందరు కూడా ముదిరాజ్ బిడ్డను అయినా నన్ను మక్తల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారని అన్నారు, ఈ సభా ముఖంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment