రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు సెయింట్ థెరిస్సా విద్యార్థులు ఎంపిక
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ లొ గల సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్థులు మంచిర్యాల జిల్లాలో డిసెంబర్ 1 నుండి 3 వరకు జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కవడం జరిగింది అని ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ తెలియజేశాడు, ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మంచిర్యాల లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో సెయింట్ థెరిస్సా స్కూల్ నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది అని, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డి.ఆశ్రిత షార్ట్ పుట్ లో జిల్లాలో రెండవ స్థానం, మరియు ఎస్ కే సాజియా స్టాండింగ్ బ్రాడ్ జంప్ లో మూడవ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు కావడం జరిగింది, అని అన్నారు, రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ కనబర్చాలని విద్యార్థులకు తెలియజేశారు, క్రీడలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు పాఠశాలల్లో విద్యార్థులకు నిత్యం క్రీడల మీద ఆసక్తి కలిగేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారికి కోచింగ్ ఇప్పించడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొని శరీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు , ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు (పి ఈ టీ )శ్రీకాంత్, మహేష్ కూడా విద్యార్థులను అభినందించడం జరిగింది