యడాది ప్రజా పాలన విజయోత్సవాలపై కళా ప్రదర్శన

యడాది ప్రజా పాలన విజయోత్సవాలపై కళా ప్రదర్శన

– సారథి కళాకారులతో ఆటపాట

– ఆరు గ్యారెంటీలు ప్రజలకు చేకూర్చే విధంగా ప్రజలలోకి తీసుకెళ్లాలి

– 6 గ్యారంటీల పథకాలు అమలు లక్ష్యంగా ప్రదర్ళనలు

మెదక్ జిల్లా నవంబర్ 23 ప్రతినిధి

మెదక్ జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా తూప్రాన్ పట్టణం, మండలంలోని నర్సంపల్లి, వెంకట రత్నాపూర్ గ్రామాలలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాపాలన పై సారధి కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా ఇప్పటివరకు ప్రజలకు చేరువైన, చేరనున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, వాటి ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ప్రజాపాలన కళాయాత్రతో పల్లె పల్లె తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. పండుగలా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేస్తూ పథకాల పైన అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ సిద్ధులు, ఎంపీడీవో శేషాద్రి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్యాణి, సాంస్కృతి సారధి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment