-:అసలు ఎవరిది ఈ నిర్లక్ష్యం
అధికారులదా
అక్రమనిర్మాణాధారులదా ..?
ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే
*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 20*
శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ లోని సిద్దిక్ నగర్ లో ఓ భవనం ఒరిగిపోయి టెంక్షన్ వాతావరణం చోటు చేసుకుంది అయితే ఇక్కడ
అక్రమ నిర్మాణా దారుల నిర్లక్ష్యానికి అధికారుల అవినీతి దాహానికి సామాన్యులు బలి కావడం అంటే ఇదేనేమో పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే.. ఆ దెబ్బకి పక్కనే ఉన్న బిల్డింగ్ ఒరిగిపోయింది… కొంప కొల్లేరు అయ్యింది అగ్గిపెట్టంత యాబై గజాల స్థలంలో ఆరు స్లాబుల భవనాన్ని నిర్మించారు అయితే ఈ భవనానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భవనం నిర్మాణం కొరకు గుంతలు తవ్వగానే భవనం ఒకవైపుకు ఒరిగిపోయి
మంగళవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకుంది. ఒక్కసారిగా ఐదు అంతస్థుల భవనం వరగడంతో. బిల్డింగ్‌లోని 30 మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. థర్డ్ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న.. ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్క స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ డివిజన్‌లోని సిద్ధిఖీనగర్ ప్లాటు నం.1639లోని 50 గజాల స్థలంలో వి.లక్ష్మణ్, స్వప్న దంపతులు జీ+4+పెంట్‌హౌస్ బిల్డింగ్ కట్టుకున్నారు. దానికి హ్యాపీ రెసిడెన్సీ అని నామకరణం చేశారు. గ్రౌండ్ ఫ్లోరు, పెంట్‌హౌస్‌లో ఒక సింగిల్ రూమ్ ఏర్పాటు చేయగా, మిగిలిన నాలుగు అంతస్తుల్లో డబుల్ రూమ్ లెక్కన కట్టారు. ప్రస్తుతం ఆయా గదుల్లో.. మణిపుర్, అస్సాంకు చెందిన 40 నుంచి 50 మంది చిరు ఉద్యోగులు ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆ బిల్డింగ్ కు అనుకొని మరో కొత్త భవన నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. మంగళవారం ఉదయం రెండు పిల్లర్లకు గుంతలు తవ్వారు. దాని ఎఫెక్ట్‌తో రాత్రి 8.30 గంటల సమయంలో హ్యాపీ రెసిడెన్సీ ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. భవనంలో నివాసం ఉంటున్న వారు భయాందోళనకు లోనై… బయటకు పరుగులు తీశారు కాసేపటికి పోలీసులు రెస్క్యూ టీమ్ లు జిహేచ్ఏంసీ అధికారులు స్పాట్ కు చేరుకొని అ యొక్క స్థలం లో నిబంధనలకు విరుద్ధంగా ఆరు స్లాబులు నిర్మించినట్లు గుర్తించారు దింతో హ్యాపీ రెసిడెన్సీ తో పాటు పక్కనున్న బిల్డింగ్లను ఖాళీ చేపింఛీ ఒరిగిన భవనాన్ని పూర్తిగా కూల్చి వేశారు
భవన యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన జీవితం అగమయ్యిందని కన్నీలు పెట్టుకుంటూ తనకు ఊర్లో ఉన్నటువంటి రెండెకరాల పొలం అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని ఇప్పుడు పూర్తిగా కూల్చివేస్తే తనకు దిక్కెవరనీ. తనకుటుంబం రోడ్డున పడిపోయిందని బోరున విలపిస్తున్నాడు
*ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే*
పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న స్థానికులు. ఇప్పటికైనా. టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తు నుండి మేల్కొని. మాముళ్ల మత్తు వీడి ఎక్కడైతే అనుమతులకు విరుద్ధంగా అక్రమనిర్మాణాలు వెలుస్తున్నాయో అక్కడికి వెళ్లి ఈ అక్రమ నిర్మాణాలను నిర్మూలిస్తే. ఇలాంటి ఘటనలు పునర్వుత్తమ్ కావని స్థానికులు అంటున్నారు