తాటి చెట్టు పైనుండి కిందపడిన గీత కార్మికునికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పెద్ద పాఠశాల గ్రామానికి చెందిన పొనగని మహేష్ అనే గీత కార్మికుడు వృత్తిలో భాగంగా మంగళవారం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాస్తు కాలుజారి కింద పడగా కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సహకార తోటి గీత కార్మికుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించారు బాధితునికి ప్రభుత్వం అండగా నిలిచి గీత కార్మికునికి ఆర్థిక సాయం అందజేయాలని తోటి గీత కార్మికులు కోరారు ఈ సందర్భంగా తోటి గీత కార్మికులు మాట్లాడుతూ పోనగాని మహేష్ గౌడ్ చాలా పేద కుటుంబంకి చెందినవారని కులవృత్తిని నమ్ముకొని రోజు తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసి అమ్ముకునే జీవన ఉపాధిగడుపుతున్నారు అలాంటి గీత కార్మకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.