మత్తు పదార్థాలతో భవిష్యత్తు అంధకారం

మత్తు పదార్థాలతో భవిష్యత్తు అంధకారం 

-ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్ 

విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం అవుతుందని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం కాన్షియస్ నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం ద్వారా అనారోగ్యానికి గురవుతామని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి, డ్రగ్స్ కోసం పైసలు లేకుంటే దొంగతనాలు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థి దశ నుండి దురాలవాట్లకు దూరంగా ఉండి మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని వారి ఆశలను అడియాశలు చేయకూడదని అన్నారు. డ్రగ్స్ మాఫియా తొమ్మిదవ ,పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ ను అలవాటు చేస్తారని అన్నారు. ఒకప్పుడు పట్టణాలలో ఉండే డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రావడం చాలా బాధాకరమని అన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు. సమాన వయస్సు వారితో మాత్రమే స్నేహం చేయాలని పెద్దవారితో స్నేహం చేస్తే దురలవాట్లకు అలవాటుపడే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్ వాడితే భవిష్యత్తులో మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామి ఉపాధ్యాయులు ఠాగూర్ శాంత కుమార్ సింగ్ బైరి సుధాకర్, హనుమండ్ల భాస్కర్ రవీందర్ రెడ్డి ,హరియా ,చిరంజీవి ,సుజాత, నిర్మల, కానిస్టేబుళ్లు రాజశేఖర్ ,సంతోష్ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment