23,116 వేలు పలికిన మెగా వినాయక ఉత్సవకమిటీ లడ్డు

23,116 వేలు పలికిన మెగా వినాయక ఉత్సవకమిటీ లడ్డు

 లడ్డూను దక్కించుకున్న దేశ గాని శ్రీనివాస్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44 వ వార్డు విద్యానగర్ వద్ద ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని లడ్డూను మెగా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లడ్డూ వేలంపాట కార్యక్రమంలో 44 వ వార్డ్ విద్యానగర్ చెందిన దేశ గాని శ్రీనివాస్ ఇరవై మూడువేల నూట పదహారు రూపాయలకు లడ్డును సోమవారం వేలం పాటలో దక్కించుకున్నారు. కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి కమిటీ సభ్యులు చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా, ఘనంగా నిర్వహించుకోవడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment