కవిత సంపుటి

చార్మినార్ ఎక్స్ ప్రెస్, హుస్నాబాద్ నియోజక వర్గం ,సెప్టెంబర్ 16 

 

ప్లాస్టిక్ ప్రళయం ఆరికట్టు

పరిసరాలను పరిరక్షించు.

 

కోడి కూతల అరుపులు

ఊరపిచ్చుకల కిచ కిచలు 

రామ చిలుకల కిలకిలలు

కోకిలమ్మల రాగాలు

గొర్రెంకల గలగలలు

పావురాల పకపకలు

గువ్వల గుసగుసలు

పాలపిట్టల పరువాలు

వడ్లపిట్టల శబ్దాలు

సమరు కాకి సంబరాలు

కర్రె కాకుల గడబిడలు

సీతువల అల్లర్లు

కొంగల కోలాహలం

బాతుల సోయగాలు

నెమళ్ళ నాట్యాలు

కౌంజుల పరుగులు

బుర్క పిట్టల సిత్రాలు

గుడ్ల గూబల ఊంకారాలు

పల్లె అందాలకు తార్కాణాలు

పకృతి కలుషితం అయ్యిందా

జీవరాశుల పని గోవిందా

దేహం ఉన్నంత వరకు

 దేశానికి ద్రోహం చెయ్యకు

స్వచ్ఛ భారత్ నిర్మాణ్ కరో 

మేరా భారత్ మహాన్ భోలో

ప్లాస్టిక్ ప్రళయం ఆరికట్టు

పరిసరాలను పరిరక్షించు.

అనపురం రమేశ్ గౌడ్ ఎంఏ
గ్రామం: మాణిక్యపూర్
మండలం : వెన్కెపల్లి సైదాపూర్
జిల్లా : కరీంనగర్
తెలంగాణ .

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment