రైతుల సానుకూలం నిమ్స్ ప్రాజెక్టుకు శుభ పరిణామం

రైతుల సానుకూలం నిమ్స్ ప్రాజెక్టుకు శుభ పరిణామం

నిమ్డ్ డిప్యూటీ కలెక్టర్ రవీందర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతు.. లక్షలాది యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నిమ్స్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు సానుకూలంగా ముందుకు రావడం ఎంతో శుభ పరిణామమని నిమ్టే ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, రేజింతల్ గ్రామంలో భూ బాధితులతో ఏకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. స్థానిక గ్రామంలో 1700 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సిన ఉండగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 400 ఎకరాల మేర భూమిని ప్రాజెక్టుకు ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు ప్రాజెక్టు ఉప తహసిల్దార్ జనార్ధన్, అధికారులు గోకుల్, పురుషోత్తం, రైతులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment