అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో మిన్న

అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో మిన్న అని 44వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్అన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఎనిమిదవ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డు విద్యానగర్ లో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదా న దాత రమణ దంపతులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో పవిత్రమైంది అన్నారు. కుల మతాలకతీతంగా జరుపుకొని వినాయకుని పండుగలో అన్నదాన దాతగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ నెల 16న జరిగే గణేష్ నిమజ్జోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకొని సూర్యాపేటలో 44వ వార్డు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను పెంపొందించుకొని నడుచుకోవాలని అన్నారు. వినాయకుని ఆశీస్సులతో 44వ వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి కమిటీ సభ్యులు తది తరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment