ప్రభుత్వాలు మారిన పాలన తీరు మారదా..?-ప్రజా పాలన ఏడవ గ్యారెంటీ అర్థమేమిటి..?
-మణుగూరులో అరెస్టు చేసిన సిఎల్సి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి,లక్ష్మణ్,నారాయణ రావు తదితరులను వెంటనే విడుదల చేయాలి!.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
కరకగూడెం బూటకపు ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం(CLC) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్,రాష్ట్ర కార్యదర్శి నారాయణ రావు,సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితర 11 మంది హక్కుల సంఘo నాయకుల్ని మణుగూరు సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తీవ్రంగా ఖండించారు.ప్రజాపాలన అంటూ పౌరహక్కుల రక్షణను ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభత్వం ఆ హామీలను తుంగలో తొక్కిందన్నారు.బయ్యారం గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ నిజనిర్ధారణకు వెళ్తున్న వారిని ఆపడం అంటే వాస్తవాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడమే అవుతుందన్నారు.నిజమైన ఎన్కౌంటర్ అయితే నిజ నిర్ధారణ బృందాన్ని జరిగిన ప్రాంతానికి అనుమతించాలని,
కరకగూడెం ఎన్కౌంటర్ పోలీసులు పక్కా పథకం ప్రకారం కాల్చి చంపడం వల్లనే నిజనిర్ధారణ బృందాన్ని, పత్రికల వారిని అనుమతించ కుండా, బయట ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా చేయుటకు నిజ నిర్ధారణ బృందాన్ని అశ్వాపురం పోలీసు స్టేషన్లో నిర్బంధించారని అన్నారు.నిజనిర్ధారణ బృందాన్ని విడుదల చేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, వాస్తవాలను తెలుసుకొనుటకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారినా పాలన తీరు మారటం లేదనటానికి బూటకపు ఎన్ కౌంటర్లు, ఈ అక్రమ నిర్భందాలే నిదర్శనమన్నారు.ప్రభుత్వం ఇచ్చిన ప్రజాస్వామిక పాలన అనే ఏడవ గ్యారంటీ ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం,పార్టీ గ్రామ నాయకులు కొదుమూరి నాగేశ్వరరావు, బీరెడ్డి సంగయ్య,కోనూరి యుగందర్,ఎనుగుల మురళీ, నిడికొండ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.