శాంతి భద్రతల పరిరక్షణ కోరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. :జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

శాంతి భద్రతల పరిరక్షణ కోరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

:జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సిర్పూర్ టి ప్రతినిధిసెప్టెంబర్ 7

కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనిజైనూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు విధించిన 144 సి.ఆర్.పి.సి. సెక్షన్ అమలులో ప్రజల సౌకర్యార్థం సడలింపు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కొరకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు సడలింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఘటన నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్, వాంకిడి, తిర్యాణి మండలాలు మినహా జిల్లాలోఅందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యంతో శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

Join WhatsApp

Join Now

Leave a Comment