ఉజ్లంపాడ్ గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి
సిర్గాపూర్ మండలం ఉజ్లాంపాడు గ్రామానికి చెందిన రైతు రాథోడ్ నెహ్రూ యొక్క ఎద్దు పొలంలో పిడుగు పడి మరణించింది ఎంతో కష్టంతో పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో వ్యవసాయం చేయడానికి ఒక కుడి భుజం విరిగినట్టు అయిందని రాథోడ్ నెహ్రూ విలవిలాడిపోయాడు సంఘటన జరిగిన స్థలానికి మండల తాసిల్దార్ ఉమా శంకర్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు రాథోడ్ నెహ్రు రైతుకి ఆదుకుంటామని తాసిల్దార్ భరోసా ఇచ్చారు,నష్టం జరిగిన రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ శోభవతి శంకర్ కోరారు.