రామచంద్రపురం గ్రామంలో ఇళ్ళు కోల్పోయిన వారికీ నిత్యావసర సరుకుల పంపిణీ.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
గత వారం రోజులుగా బంగాళఖతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బయ్యారం మండలంలోని రామచంద్రపురం గ్రామాపంచాయతీలో ఈ భారీ వర్షాలకు ప్రజలు తమ ఇళ్ళు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.ఇళ్ళు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు మాజీ ఎంపిటిసి లక్ష్మి గణేష్ దంపతులు, మాజీ ఉప సర్పంచ్ తొట్టి కృష్ణ, కరుణ,, మాజీ ఎంపిటిసి మంగీలాల్ తమ గ్రామంలో ఇళ్ళు నష్టపోయినా మూడు కుటుంబాలకు చేయూతనందించి వారికి అవసరం అయినా నిత్యావసర సరుకులను బయ్యారం మండల తహసీల్దార్ బి. విజయ,ఆర్ ఐ నారాయణ,,, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో వారికీ పంపిణీ చేశారు.దీనితో వీరి సేవలను గ్రామ ప్రజలు స్థానికులు కొనియాడారు.ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ మండలంలో తుఫాన్ బాధితులకు రాజకీయ నాయకులు,అధికారులు,యువత ముందుకొచ్చి భారీ వర్షాలకు నష్టపోయిన వారిని అదుకోవాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో వేల్పుల శ్రీనివాస్, వెంకటపతి ఇతర మండల నాయకులు పాల్గొన్నారు.