వికసిత్ భారత్ నిర్మాణంలో భాగమవ్వండి …కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

— బీజేపీ తో మమేకమవ్వండి ….

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్04*

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో, వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం అన్ని రంగాల్లో సమూల మార్పులతో ప్రగతిపథంలో ముందుకు సాగుతోంది. దేశ అభివృద్ధికి మీ వంతు కృషిని అందించేందుకు, బిజెపిలో సభ్యత్వం పొందండి, దేశ ప్రగతిలో భాగస్వామ్యం అవ్వండి అన్ని అన్నారు. సభ్యత్వ నమోదుకు తక్కువ రోజులు ఉన్నందున వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా,డివిజన్ నాయకులు, సీనియర్ నాయకులు,స్థానిక నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment