మహబూబాబాద్ నుండి వెళ్ళే బస్సుల దారి మళ్ళింపు.
మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
మహబూబాబాద్ డిపో నుండి వివిధ రూట్లలో బస్సులను దారి మళ్లింపు చేసి నడపడం జరుగుతుందని డిపో మేనేజర్ ఎం శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల రహదారులు దెబ్బ తినడంతో దారి మళ్ళింపు చేసి బస్సులు నడుస్తాయని తెలిపారు.
-వాటి వివరాలు క్రింది విధంగా..
1)కురవి — ఖమ్మం రూట్ నందు ములకలపల్లి వరకు బస్సులు సెటిల్ చెయ్యడం జరిగింది .ఖమ్మం వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం డోర్నకల్ –లింగాల మీదుగా ఖమ్మం బస్సులు నడపబడుచున్నవి.
2)నెక్కొండ- కేసముద్రం–వరంగల్ రూట్ నందు మహబూబాబాద్ నుండి కేసముద్రం -ఇనుగుర్తి- రెడ్లవాడా- నెక్కొండ మీదుగా వరంగల్ కు బస్సులు నడపబడుచున్నవి.
3) తొర్రూర్ రూట్ లో మహబూబాబాద్ నుండి కేసముద్రం -ఇనుగుర్తి- నెల్లికుదురు మీదుగా తొర్రూర్ బస్సులు నడుస్తాయి.
4)సూర్యాపేట రూట్ లో ధర్మారం స్టేజి వరకు మహబూబాబాద్ డిపో బస్సులు నడుస్తాయి.మరిపెడ బంగ్లా నుండి సూర్యాపేట వరకు సూర్యాపేట డిపో బస్సులు నడపబడుచున్నవి.
5)మహబూబాబాద్ నుండి నర్సంపేట- వరంగల్- హనుమకొండ- హైదరాబాద్ రూట్ లో బస్సులు అన్ని కూడా యధావిధిగా పునర్ ప్రారంభించబడినవి.
-ఇట్టి విషయాన్ని ప్రయాణికులు, ప్రజలు గమనించి సౌకర్యాన్ని వినియోగించుకోగలరు.