మళ్లీ మొదలైన మధురవాణి దౌర్జన్యం.కబ్జాకు విశ్వప్రయత్నాలు.

మళ్లీ మొదలైన మధురవాణి దౌర్జన్యం.కబ్జాకు విశ్వప్రయత్నాలు.

-నకిలీ పత్రాలు సృష్టించి కోర్టుని బురిడీ కొట్టించిన వైనం.

-ఆర్టిఏ సమాచారంతో నకిలీ పత్రాలు వెలుగులోకి.

-మహిళ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. తీరు మారని వైనం.

-న్యాయం కోసం పోలీసులకు వేడుకోలు

బయ్యారం:(చార్మినార్ ఎక్స్ ప్రెస్)ఆగస్టు 6.

నకిలీ దస్తావేజులతో రెండెకరాల 10 గుంటలు మేనత్తల పసుపు కుంకుమ భూమిని కొట్టేయాలని చూసిన ఘటన బయ్యారం మండలం సంతులల్ పొడ్ తండాలో చోటుచేసుకుంది.బాధితురాలు వివరాలు ఇలా ఉన్నాయి. దంచనాల చంద్రకళ సూర్యకళ మా తల్లి కాంతమ్మకి తన తండ్రి దంచనాల చంద్రయ్య 1965 సంవత్సరం పసుపు కుంకుమ కింద రెండు ఎకరాల 10 గుంటలు భూమి ఇచ్చారు.మా తల్లి తదనంతరం ఆ భూమిని మా అన్నయ్య సుదర్శన చారితో మా ముగ్గురు అక్కచెల్లెలం కలిసి సాగు చేసుకుంటున్నాం.2018 సంవత్సరం మా అన్నయ్య ఆ భూమిని ఎట్లయినా తన సొంతం చేసుకోవాలని కుట్రపూరితమైన ఉద్దేశంతో 2021 వ సంవత్సరంలో అన్ని పత్రాలను సృష్టించి భద్రాచలం మొబైల్ కోర్టులో దావా వేసి కోర్టును సైతం మోసం చేశాడు. నకిలీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను సృష్టించిన దస్తావేజుతో ఇంజక్షన్ ఆర్డర్ పొంది తద్వారా ఆ భూమిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేసింది. కానీ అన్నయ్య సతీష్ కుమార్ వారు సృష్టించిన జ్యూడిష స్టాంప్ పేపర్ లపై ఆర్టిఏ పై సమాచారం కోరగా అవి ఫేక్ బ్యాక్ డేట్ లో కొన్నవని డిస్టిక్ రిజిస్టర్ ఇచ్చిన సమాచారంతో సదరు మహిళపై బయ్యారం పోలీస్ స్టేషన్లో 11/4/2022 న 51/2022 పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్. సి.సి 275/2023 చార్జిషీట్ నమోదు చేశారు.అయినా మేనకోడలు జవ్వాజి మధురవాణి లో ఎటువంటి మార్పు రాక మళ్ళీ భూమ్మీదకి వచ్చి మేనత్తల మామ ల పై దౌర్జన్యం చేసి ఆ భూమి నాది అంటూ మమ్మల్ని భూమిలోకి రానీయకుండా వ్యవసాయ పనులు చేసుకోకుండా అడ్డుపడుతూ ఆర్థికంగా కూడా నష్టం వచ్చేలా చేస్తుంది. నిందితులు కోర్టులో వేసిన తప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ని కోర్టు కొట్టివేయడం జరిగింది. అప్పటినుండి మేనత్త మేనా మామ స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని మరల ప్రయత్నం చేస్తుంది. మేనత్తల్లో ఒకరైన చంద్రకళవతికి అసలే హార్ట్ పేషెంట్ ఇటీవలే ఆమెకు బైపాస్ ఆపరేషన్ జరిగిందనీ కోర్టు ద్వారా మాకు క్లియరెన్స్ వచ్చిన తనపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదైన మా భూమి లోకి మమ్మల్ని పోనీయకుండా అడ్డుపడుతుంది. ఆ భూమికి సంబంధించి అన్ని రకాల హక్కు పత్రాలు మా దగ్గర ఉన్న కోర్టు ఉత్తర్వులు ఉన్న కానీ తాను అడ్డుకుంటుందని న్యాయం కోసం మేము ఎవరిని ఆశ్రయించాలి లో అర్ధం కాక వృద్ధురాలు చంద్రకళ కన్నీరు మున్నూరు అవుతున్నారు.జరిగిన విషయాన్ని బయ్యారం పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశాము పోలీసులు స్పందించి కబ్జా చేస్తున్న వారిపై చట్టరీత్యా శిక్షించాలని కోరుతున్నారు.

 

దీనిపై ఎస్ ఐ తిరుపతి వివరణ కోరగా బాదితులు పిర్యాదును పరిశీలించి సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment