కోల్పూర్ గ్రామం మండల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం
కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొలుపూరు గ్రామపంచాయతీ ఆవరణలో మండల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉదయం 8 గంటల 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన్న ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థినిలతో ప్రభత్ బేరి నిర్వహించడం జరిగింది ఈ ప్రబద్ బేరి మండల ప్రాథమిక పాఠశాల నుండి కోల్పూర్ గ్రామం చింత చెట్టు వరకు నిర్వహిస్తూ తిరిగి మండల ప్రాథమిక పాఠశాలకు ప్రయాణం కావడం జరిగింది తధానంతరం కొలుపు గ్రామపంచాయతీ దగ్గర త్రివర్ణ పథకాన్ని ఎగరవేస్తూ గణతంత్ర దినోత్సవం గురించి అనేకమంది వక్తలు మాట్లాడుతూ తదనంతరం కొలుపూర్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ దగ్గర వివరణ పథకం ఎగరవేస్తూ రాజ్యాంగం విశిష్టతను వివరిస్తూ నేరుగా మండల ప్రాథమిక పాఠశాల కి గ్రామ పెద్దలంతా చేరుకొని మండల ప్రాథమిక పాఠశాలలో త్రివర్ణ పథకాన్ని ఎగరవేస్తూ రాజ్యాంగ విశిష్టతను వివరిస్తూ విద్యార్థిని విద్యార్థినిలకు బహుమానాలు బహుకరిస్తూ గ్రామంలో పెద్దలు గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు కేవీ నరసింహా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాలలో చాలా గొప్పదని అలాగే రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఇక నుండి పిల్లలు పెద్దలు యువకులు తదితరులు కూడా రాజ్యాంగ విశిష్టతను తెలుసుకోవాలని రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు చదువుతూ రాజ్యాంగ విశిష్టతను ప్రపంచానికి గుర్తుచేయాలని కొనియాడారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన్న మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ వ్యవస్థాపకులు కేవీ నరసింహ రాజు రాకేష్ తాయప్ప గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ స్పెషల్ ఆఫీసర్ తిమ్మప్ప సోనీ నిహారిక మహేష్ విద్యార్థిని విద్యార్థినిలు గ్రామ పెద్దలు యువకులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు