76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్పల్లి, రసూల్ పూర, అన్నా నగర్, బ్రూక్ బాండ్ కాలనీ, ఓల్డ్ గాంధీ నగర్ మరియు బొల్లారం లలో పలుచోట్ల ఎమ్మెల్యే శ్రీగణేష్ జాతీయ జెండా ఎగురవేసి, 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం మాత్రం జనవరి 26, 1950 లో అమల్లోకి వచ్చిందని అందుకే ఈ రోజును గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ రోజున దేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయులతో పాటు దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగమే దేశ పౌరులందరికీ సమాన హక్కులు ఇచ్చిందని, స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు లతో పాటు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు కూడా రాజ్యాంగం కల్పించిందని ఎమ్మెల్యే చెప్పారు.
అసమానతలతో ఉన్న దేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించిందని రాజ్యాంగం యొక్క గొప్పతనం అందరికీ వివరించారు.
అందుకే దేశంలోని పౌరులు అందరూ రాజ్యాంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని అప్పుడే వారి విధులు, హక్కులు తెలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, పలు బస్తీల ప్రజలు పాల్గొన్నారు.